మానవుడు,అహం, ద్వేషం, అసూయ వీడితే ఉన్నతికి చేరువ అవుతారని పశ్చిమ బెంగాల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎన్ రాధాకృష్ణన్ అన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో కేరళీయుల ఓనం వేడుకలు ఘనంగా ప్రారంభమవగా ఈ వేడుకల్లో జస్టిస్ రాధాకృష్ణన్ పాల్గొన్నారు. వేదపఠనంతో వేడుకలు ప్రారంభించిన కేరళీయులు వారి సాంప్రదాయలను ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కేరళ కాళికట్ బాల వికాస్ చిన్నారులు దక్షయాగం, నృత్య నాటికను అద్భుతంగా ప్రదర్శించారు. నాటికలో పరమశివుడు.. సతీ వివాహ ఘట్టాలు, కైలాసంలో సన్నివేశాలు, అహంభావంతో జరిగే అనార్థాలను కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించారు. కేరళీయులు సంయుక్తంగా సత్యసాయి భక్తిగీతాలు అందర్నీ మంత్రముగ్ధులను చేశాయి. ఈ సందర్భంగా న్యామూర్తి మాట్లాడుతూ.. ప్రపంచ మానవాళిని సేవా మార్గం వైపు నడిపించిన మహానీయుడు సత్యసాయి బాబా అన్నారు. ప్రశాంతి నిలయంకు వస్తే లభించే ప్రశాంతత దేశంలో ఎక్కడా లభించదన్నారు.
'దేని గురించి బాధపడకూడదు.పాత విషయాలను మర్చిపోవాలి..రేపటి గురించి బాధపడకుండా..నిన్నటి విషయాలపై చింతించకుండా ఉండాలి. ఈ రోజు ఏం చేయగలమో అదే చేయాలి..సాయిరాం నామస్శరణతో ఏ పనినైనా సాధించగలం..సాయిరాం.. సాయిరాం..' -టీఎన్ రాధాకృష్ణన్.
ఇదీ చూడండి: