అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం సర్వేయర్ హేమ సుందర్ ఓ మహిళా రైతు నుంచి 1.4 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మండల కేంద్రానికి చెందిన ఎన్.జయమ్మ అనే మహిళ రైతు నుంచి కళ్యాణదుర్గం మండలంలో నలభై సెంట్లు భూమి కొలతలు చేయడానికి రూ.రెండు లక్షల లంచం డిమాండ్ చేశాడు. అనంతరం రూ.1.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొన్నాడు. సమాచారం అందుకున్న కర్నూలు రేంజ్ డీఎస్పీ శివ నారాయణ స్వామి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి... మహిళ రైతు నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఇదీ చదవండి
ఆటో బోల్తా... వ్యవసాయ కూలీలకు తీవ్ర గాయాలు
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!