TDP Protest for Bridge: అనంతపురం జిల్లా కంబదూరు, నూతిమడుగు సమీపంలో పెన్నా నదిపై బ్రిడ్జి కూలిపోవడంతో రైతులు, విద్యార్థులు అవస్థలు పడుతున్నారని.. తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టలేరా అంటూ.. కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇంచార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిడ్జి సమీపంలో 'ఇదేం కర్మ పోస్టర్లు' పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ ఆద్వర్యంలో కంబదూరులోని నూతిమడుగు గ్రామంలో 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు, రైతుల సమస్యలను ఆడిగి తెలుసుకున్నారు. పలు కారణాలతో పింఛన్లను అన్యాయంగా తీసేస్తున్నారని, ఎద్దుల బండిపై ఇసుక తీసుకురావాలన్నా ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారంటూ విమర్శలు చేశారు. కూలిన వంతెనను వెంటనే నిర్మించాలంటూ డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: