అన్ని వర్గాల వారికి ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అందిస్తున్నామని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు. కళ్యాణదుర్గం మండలం పాలవాయి గ్రామంలో పొలంబడి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె రైతులతో మాట్లాడారు. అనంతరం వేరుశనగ విత్తన శుద్ధి ప్రక్రియ పరిశీలించి, విత్తనాలు వేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులందరికీ రాయితీపై విత్తనాలు అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
ఇదీ చదవండి : మైలవరం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిలో ఒకరికి కరోనా