ETV Bharat / state

హైదరాబాద్‌ మెట్రో రెండో దశ - నిర్మాణానికి పరిపాలన అనుమతులు - METRO RAIL

రూ.24,269 కోట్లతో మెట్రో రెండోదశ - రెండోదశలో 76.4 కి.మీ. మేర మెట్రో రైలు

hyderabad metro
hyderabad metro (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 2, 2024, 5:42 PM IST

Updated : Nov 2, 2024, 5:59 PM IST

Hyderabad Metro Rail Second Phase: హైదరాబాద్​లో మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసింది. రెండో దశలో నిర్మించబోయే 76.4 కిలో మీటర్ల మార్గానికి 24 వేల 269 కోట్ల రూపాయలను జారీ చేస్తూ జీవో 196 పేరుతో ఉత్తర్వులు విడుదల చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో మెట్రో రైలు రెండో దశ నిర్మాణం జరుగుతుందని తెలిపిన ప్రభుత్వం రాష్ట్ర వాటాగా 7 వేల 313 కోట్లు, కేంద్రం వాటాగా 4 వేల 230 కోట్ల రూపాయలు ఉంటుందని పేర్కొంది.

అలాగే జపాన్ ఇంటర్నెషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ, న్యూడెవలప్ మెంట్ బ్యాంకు, ఏషియన్ డెవలప్​మెంట్ బ్యాంకుల నుంచి 48 శాతం వాటాగా 11 వేల 693 కోట్లు, పీపీపీ పద్దతిలో మరో వెయ్యి 33 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. మొదటి దశలో 22 వేల కోట్లతో 69 కిలోమీటర్లు మెట్రో రైలు మార్గాన్ని నిర్మించామని, అది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రపంచంలో నిర్మించిన అతి పెద్ద ప్రాజెక్టుగా తెలిపిన ప్రభుత్వం రోజుకు 5 లక్షల మంది మెట్రో రైలులో ప్రయాణిస్తున్నట్లు వివరించింది.

మొదటి దశ విస్తరణతోపాటు రెండో దశ చేపట్టే క్రమంలో నగర విస్తరణ, ట్రాఫిక్ రద్దీపై సమగ్రంగా అధ్యయనం చేశాక ప్రస్తుతమున్న మూడు కారిడార్లతోపాటు అదనంగా మరిన్ని కారిడార్లలో మెట్రో సేవలు అవసరమని ప్రభుత్వం గుర్తించినట్లు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా మెట్రో రైలు రెండో దశ కారిడార్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, రెండో దశలో మొత్తం 116.4 కిలోమీటర్లు మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వివరించారు.

అయితే అందులో మొదటగా పార్ట్ ఏ కింద 76.4 కిలోమీటర్ల మార్గానికి పరిపాలన అనుమతులు మంజూరు చేశామని, పార్ట్ -బిలో నిర్మించనున్న శంషాబాద్ విమానాశ్రయం నుంచి వ్యూచర్ సిటీ వరకు 40 కిలో మీటర్ల మార్గానికి సర్వే జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. కారిడార్ 4లో నాగోలు- శంషాబాద్ విమానాశ్రయం వరకు 36.8 కిలో మీటర్లు, కారిడార్ 5లో రాయదుర్గ- కోకాపేట నియోపోలిస్ వరకు 11.6 కిలో మీటర్లు, కారిడార్ 6లో ఎంజీబీఎస్ నుంచి చాంద్రయాణగుట్ట వరకు 7.5 కిలో మీటర్లు, కారిడార్ 7లో మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు 13.4 కిలో మీటర్లు, కారిడార్ 8లో ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు 7.1 కిలో మీటర్లు నిర్మించనున్నట్లు తెలిపిన ప్రభుత్వం మెట్రో రైలు రెండో దశ పార్ట్-బిగా కారిడార్ 9లో శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్యూచర్ సిటీలోని స్కిల్ యూనివర్సిటీ వరకు మెట్రో రైలును అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.

రాష్ట్రంలో మెట్రో పరుగులు - రూ.42,362 కోట్లతో ప్రతిపాదనలు

విజయవాడ మెట్రో అమరావతికి అనుసంధానం - కేంద్రమంత్రితో నారాయణ చర్చలు

Last Updated : Nov 2, 2024, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.