అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని కరిడికొండ, వన్నె దొడ్డి గ్రామాలలో అకాల వర్షాలకు దెబ్బతిన్న వేరుశెనగ పంటపొలాలను బుధవారం తేదేపా మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు పరిశీలించారు. గత నెల రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రైతులు సాగు చేసిన వేరుశనగ పంటలు పొలాల్లోనే కుళ్లి పోయాయని అన్నారు. పశువుల మేతకు సైతం పనికిరాకుండా పొలాల్లోనే పంట కుళ్లి పోయిందని ఆవేదన చెందారు.
తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలని సీఎం జగన్ ను కోరారు. అకాల వర్షాల కారణంగా అనంతపురం జిల్లాలో దెబ్బతిన్న వేరుశనగ పంటలను పరిశీలించడానికి ఈ నెల 23న శుక్రవారం రోజు అనంతపురం జిల్లాలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటిస్తారని కాలవ శ్రీనివాసులు తెలిపారు.
ఇదీ చదవండి: