ధైర్యంగా ఉంటే కరోనా వైరస్ బారి నుంచి బయటపడవచ్చని అనంతపురం జిల్లా కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డి అన్నారు. రోజురోజుకు కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో బాధితులకు వైద్య సేవలు అందించేందుకు పట్టణములోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను కొవిడ్ కేర్ సెంటర్ గా మార్చారు. 250 పడకలతో బాధితులకు అవసరమైన సదుపాయాలను కల్పించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కొవిడ్ కేర్ సెంటర్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే అవసరమైన సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. కరోనావైరస్ నివారణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని సిద్దారెడ్డి అన్నారు.
ఇదీ చూడండి