అనంతపురం జిల్లా తలుపుల మండలం బట్రేపల్లి జలపాతం పెద్దసంఖ్యలో పర్యటకులను ఆకర్షిస్తోంది. కదిరి డివిజన్ పరిధిలోని దట్టమైన అటవీప్రాంతంలో ఎత్తైన కొండల నుంచి జాలువారే వర్షపు నీటిని తిలకించేందుకు... వచ్చే సందర్శకుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ ప్రాంతంలో పర్యటకులను అవసరమైన వసతులు కల్పించేందుకు పదిహేనేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం ప్రణాళికలు పంపాల్సిందిగా అధికారులను ఆదేశించింది. అప్పటి నుంచి ఒక్క అడుగు ముందుకు పడలేదు.
తాజాగా కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డి బట్రేపల్లి జలపాతాన్ని సందర్శించారు. పర్యటకులు జలపాతం వద్దకు వెళ్లేందుకు.. అవసరమైన దారి ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అధికారులతోపాటు జలపాతం వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే రహదారి సదుపాయంతోపాటు, పర్యటక శాఖ ద్వారా సందర్శకులకు అవసరమైన వసతులు కల్పించేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలిపారు. త్వరలోనే రోడ్డు పనులను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఇదీ చదవండీ...ఆశల పునాదికి సమాధి... ఐదేళ్లలో అంతా ఆవిరి!