అనంతపురం జిల్లా కదిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి నూతన సంవత్సర క్యాలెండర్ను కదిరి శాసనసభ్యులు సిద్ధారెడ్డి ఆవిష్కరించారు. ఆలయ ఆవరణలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డప్ప శెట్టి, ఈ ఓ వెంకటేశ్వర్ రెడ్డి , ప్రధాన అర్చకుడు నృసింహ చార్యులతో కలిసి ఎమ్మెల్యే విడుదల చేశారు.
స్వామివారి ఛాయాచిత్రాలు, వార్షిక బ్రహ్మోత్సవాల అలంకరణ, స్వామివారి ప్రధాన వేడుకలతో కూడిన వివరాలను క్యాలెండర్లో పొందుపరిచారు.
ఇదీ చదవండి: టిక్కెట్లు ఉన్నవారికే శ్రీవారి దర్శన అనుమతి: తితిదే ఈవో