గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఇంటి పట్టాలకు భూములను చూపించాలంటూ అనంతపురం జిల్లా ఉరవకొండలో జర్నలిస్టులు నిరాహారదీక్ష చేపట్టారు. సామాన్య ప్రజలకు ఇంటి స్థలాలు మంజూరు చేసిన ప్రభుత్వం..జర్నలిస్టుల విషయంలో అన్యాయంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తమకు రావాల్సిన స్థలం కోర్టులో పెండింగులో ఉందంటూ కాలం వెళ్లదిస్తున్నారని.. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు స్థలాలు చూపాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్షలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండీ.. CM Jagan: కొవిడ్ వ్యాప్తిపై మరింత అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్