ETV Bharat / state

ఇసుక కొరత పోలీసుల వేధింపులు... జేసీకి గుత్తేదారుల ఫిర్యాదు... - అనంతపురం జిల్లా తాజా వార్తలు

అనంతపురం జిల్లా పెనుకొండ డివిజన్ పరిధిలో చేపట్టిన పలు భవనాల నిర్మాణ పనులపై గుత్తేదారులు, అధికారులతో జేసీ సిరి సమీక్ష నిర్వహించారు. గుత్తేదారులు లేవనెత్తిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.

jc review on construction works
భవన నిర్మాణ పనుల్లో సమస్యలపై జేసీ సమీక్ష
author img

By

Published : Dec 18, 2020, 9:06 PM IST

అనంతపురం జిల్లా పెనుకొండ డివిజన్ పరిధిలోని 13 మండలాల్లో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్​ఆర్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణ పనులను సంయుక్త కలెక్టర్ సిరి ఆరా తీశారు. పనులపై గుత్తేదారులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. పలుచోట్ల 50 శాతంపైగా పనులు పూర్తి చేసినా బిల్లులు చెల్లించలేదని, ఇసుక కొరత, మరికొన్ని చోట్ల పోలీసు వేధింపుల నేపథ్యంలో నిర్మాణ పనుల్లో ఆలస్యమవుతుందని గుత్తేదారులు జేసీకి వివరించారు.

సమస్యలపై ఉన్నతాధికారులతో చర్చించి పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని జేసీ వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఇదీచదవండి

'మూడు రాజధానులపై రెఫరెండానికి మేము సిద్ధం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.