అనంతపురం జిల్లా మడకశిర మండలం జమ్మానిపల్లి గ్రామంలో దళిత శ్మశాన వాటికకు దారి చూపించాలని డిప్యూటీ తహసీల్దార్‌కు గ్రామస్థులు వినతిపత్రం అందించారు. దళితులు మరణిస్తే అంత్యక్రియల కోసం శ్మశానవాటికకు వెళ్లేందుకు దారి లేదని విచారం వ్యక్తం చేశారు.
దారికి ఇరువైపులా ఉన్న పొలాల రైతులు అటు దారి లేదని వాదిస్తున్నారని గ్రామస్థులు వాపోయారు. ఎవరైనా చనిపోతే పచ్చని పంట పొలాల నుంచి శ్మశానవాటికకు వెళ్లాల్సి వస్తోందన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి దారికి సంబంధించి భూ రికార్డులను పరిశీలించి శ్మశానవాటికకు దారి చూపాలని గ్రామస్థులు కోరారు.
ఇదీ చదవండి: నిమ్మగడ్డ వ్యవహారం: తొలగింపు నుంచి తిరిగి నియమించేదాకా....