అనంతపురం జిల్లాను బయోటెక్ హబ్‌గా మారుస్తామని.. చదువు, నైపుణ్యాలు ఉంటేనే పరిశ్రమలు రాష్ట్రానికి వస్తాయని.. మంత్రి గౌతంరెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ స్కూల్ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో నెలకొల్పిన తొలి బయోటెక్నాలజీ పరిశ్రమను.. జిల్లాలోని చిలమత్తూరు మండలం కోడూరు వద్ద గల ఇండస్ జీన్ ఎక్స్ప్రెషన్స్ లిమిటెడ్ ను మంత్రి ప్రారంభించారు.
సాఫ్ట్వేర్ నుంచి కమ్యూనికేషన్ వరకు అంతా ఆంగ్లంలోనే ఉండటంతో.. ఆంగ్ల భాషను పాఠశాలల్లో ప్రవేశపెడుతున్నామన్నారు. రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు ఉన్నప్పటికీ.. పరిశ్రమలు లేకపోవడంతో ఉద్యోగావకాశాలు లేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. అనంతపురం జిల్లా బెంగళూరుకు సమీపంలో ఉండటంతో.. ఇండస్ట్రియల్‌గా అభివృద్ధి చేయాలని సీఎం బలంగా నిర్ణయించుకున్నారని మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి:
Rayalaseema Lift Irrigation Project: కేంద్ర పర్యావరణ శాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ