ETV Bharat / state

‘తెట్టుఅమాలిక’ పేరుతో  కొత్తరకం చింత మొక్కల ఆవిష్కరణ

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలోని రేకులకుంట ఉద్యాన పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు తెట్టుఅమాలిక అనే కొత్త రకం చింత మొక్కలను ఆవిష్కరించారు. ఇవి తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి ఇస్తాయి.

కొత్తరకం చింత మొక్కల ఆవిష్కరణ
కొత్తరకం చింత మొక్కల ఆవిష్కరణ
author img

By

Published : Oct 4, 2021, 4:49 AM IST

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలోని రేకులకుంట ఉద్యాన పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు తెట్టుఅమాలిక అనే కొత్త రకం చింత మొక్కలను ఆవిష్కరించారు. ఇవి తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి ఇస్తాయి. గతంలో అనంత రుధిర పేరుతో నూతన రకం చింత మొక్కలను ఈ పరిశోధనా కేంద్రంలో ఆవిష్కరించారు.

ఆరేళ్ల కృషికి ఫలితం

2012 సంవత్సరంలో రేకులకుంట ఉద్యాన పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు నటరాజ్‌, శ్రీనివాసులు చింత చెట్లలో అధిక దిగుబడి ఇచ్చే నూతన రకాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించుకున్నారు. చిత్తూరుజిల్లా మదనపల్లె శివారులో ఉన్న తెట్టు అనే గ్రామంలో చింత చెట్ల నమూనాలు తీసుకువచ్చి పరిశోధనలు ప్రారంభించారు. 2012-2018 వరకు పరిశోధనలు చేసి కొత్త రకాన్ని సృష్టించారు. చింత నమూనాలను తెట్టు గ్రామం నుంచి తీసుకురావడంతో ఆ గ్రామం పేరు కలిసేలా తెట్టుఅమాలిక అనే పేరును ఖరారు చేశారు. 2019లో రాష్ట్ర ప్రభుత్వం తెట్టుఅమాలిక వంగడానికి గుర్తింపు ఇచ్చింది.

‘తెట్టుఅమాలిక’ ప్రత్యేకతలు

* సాధారణంగా చింత మొక్కలు నాటిన ఆరేళ్ల తర్వాత కాయలు కాయడం ప్రారంభిస్తాయి. ఈ రకం మొక్కలు నాటిన మూడేళ్ల నుంచే కాస్తాయి.

* చింతకాయల వెడల్పు, పొడవు, పరిమాణం సాధారణ రకాల కంటే పెద్దదిగా ఉంటుంది.

* మొక్కలు నాటిన నాలుగేళ్ల తర్వాత ఒక్కో చెట్టు నుంచి 20 కిలోల చింతపండు వస్తుంది. పదేళ్ల తర్వాత 200 కిలోల వరకూ వస్తుంది. సాధారణ రకాలతో పోల్చితే తెట్టుఅమాలిక రకం చింతచెట్లు తక్కువ ఎత్తు, విస్తీర్ణంలో పెరుగుతాయి.

* చింతపండు నాణ్యంగా ఉండటంతో ఈ రకం మొక్కల కోసం మన రాష్ట్రంతోపాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా నుంచి రైతులు రేకులకుంటకు వస్తున్నారు.

జాతీయస్థాయిలో గుర్తింపు
- దీప్తి, ప్రధాన శాస్త్రవేత్త, రేకులకుంట ఉద్యాన పరిశోధనా కేంద్రం

అనంత రుధిర, తెట్టుఅమాలిక రకాల పరిశోధనలతో రేకులకుంట ఉద్యాన పరిశోధనా కేంద్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ రెండు రకాల చింత మొక్కలను ఉత్పత్తి చేసి రైతులకు పంపిణీ చేస్తున్నాం. ఇప్పటి వరకూ 30వేలకుపైగా మొక్కలను రైతులకు ఇచ్చాం.

ఇదీ చదవండి:

'భూమిని పట్టా చేయమంటే.. చనిపోయావ్​ అంటున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.