ETV Bharat / state

'అనంత'దూరంలో వర్ష జాడ.. - అనంతపురం వర్షాభావంపై వాతావరణ వేత్త మళ్లీశ్వరి ఇంటర్వ్యూ

రుతుపవనాలు రాయలసీమను తాకినా వర్షాలు అంతంతమాత్రంగానే కురుస్తున్నాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో వర్షాభావ పరిస్థితి తీవ్రంగా ఉంది. ఆకాశం మేఘాలు కమ్ముకుంటున్నా... చినుకు నేలరాలటం లేదు. ఈ నెల 7వ తేదీన నైరుతి రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించాయి. దీంతో అనంతపురం జిల్లాలో 12 మండలాల్లో 30 నుంచి 50 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. మిగతా మండలాల్లో వర్షం జాడ కనిపించలేదు. జిల్లాలో వర్షాభావ పరిస్థితిపై రేకులకుంట వ్యవసాయ పరిశోధనా కేంద్రం వాతావరణ శాస్త్రవేత్త డా.మల్లీశ్వరి ఈటీవీ భారత్​తో మాట్లాడారు.

'అనంత'దూరంలో వర్ష జాడ..
'అనంత'దూరంలో వర్ష జాడ..
author img

By

Published : Jun 23, 2020, 6:34 PM IST

రేకులకుంట వ్యవసాయ పరిశోధనా కేంద్రం వాతావరణ శాస్త్రవేత్త డా.మల్లీశ్వరి ఈటీవీ భారత్​ ముఖాముఖి

ఉత్తరాదిలో కుండపోత వర్షాలు ముంచెత్తుతుంటే అనంతపురం జిల్లాలో మాత్రం చినుకు రాలటంలేదు. ఈ నెల 7వ తేదీన నైరుతి రుతుపవనాలు రాయలసీమ జిల్లాలోకి ప్రవేశించి, 11వ తేదీలోపు రాష్ట్రమంతటా విస్తరించాయి. రుతుపవనాలు ప్రవేశించి, విస్తరణ సమయంలోనే అనంతపురం జిల్లాలో పుష్కలంగా వర్షాలు కురిసే పరిస్థితి గత కొన్నేళ్లుగా కొనసాగుతోంది. అయితే ఈసారి రుతుపవనాలు ప్రవేశించాక జిల్లా వ్యాప్తంగా ఎక్కడా పుష్కలంగా వర్షాలు నమోదుకాలేదు. అల్పపీడన ప్రభావంతో ఈనెల 2వ తేదీ రాత్రి అనంతపురం జిల్లా పడమర ప్రాంతాలైన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పలు మండలాల్లో 50 మిల్లీ మీటర్ల వరకు వర్షం కురిసింది.

ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా కేవలం 12 మండలాల్లో మాత్రమే ముప్ఫై నుంచి 50 మిల్లీమీటర్ల వర్షం నమోదుకాగా, ఇతర మండలాల్లో కేవలం ఏడు మిల్లీ మీటర్ల సాధారణ వర్షం నమోదైంది. జిల్లాలో పలు ప్రాంతాల్లో కొద్దిపాటి జల్లులకు విత్తనాలు వేసిన రైతులు...వర్షం కోసం ఎదురుచూస్తున్నాయి. ఓవైపు మేఘాలు ఊరిస్తుండగా, మరోవైపు విపరీతమైన గాలితో విత్తనాలు వేసిన పొలాల్లో నేల పొడిబారిపోతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పది రోజులుగా చినుకురాలని పరిస్థితిపై అనంతపురం జిల్లా రేకులకుంట వ్యవసాయ పరిశోధనా కేంద్రం వాతావరణ శాస్త్రవేత్త డా.మల్లీశ్వరితో ముఖాముఖి.

ఈటీవీ భారత్ : రోజూ దట్టమైన మేఘాలు కనిపిస్తున్నాయి. కానీ వర్షం పడడంలేదు కారణం ఏమంటారు?

డా.మల్లీశ్వరి : ఈనెల 7న నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి, 11వ తేదీన రాష్ట్రమంతటా విస్తరించాయి. అదే సమయంలో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, అది ఉత్తర దిశగా చురుకుగా వెళ్లటంతో ఉత్తరాది రాష్ట్రాల్లో పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయి. దాని ప్రభావం వల్ల రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురవని పరిస్థితి నెలకొంది.

ఈటీవీ భారత్ : నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన సమయంలో అనంతపురం జిల్లాలోని పడమర దిశలోని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అనంతరం చినుకురాలని పరిస్థితి నెలకొంది? ఎందుకంటారు?

డా.మల్లీశ్వరి : నైరుతి రుతుపవనాలు ప్రవేశించాక పడమటి గాలి తీవ్రత పెరిగింది. గాలి వేగం గంటకు 18 కిలోమీటర్ల వరకు ఉంది. దీనివల్ల మేఘాలు దట్టంగా వచ్చినప్పటికీ అవి వర్షాన్ని కురిపించకుండానే వెళ్లిపోతున్నాయి.

ఈటీవీ భారత్: రానున్న వారం రోజుల్లో వర్షపాత అంచనాలు ఎలా ఉన్నాయి ?

డా.మల్లీశ్వరి: ప్రతి గురువారం వాతావరణ విభాగం ముందస్తు అంచనాలు ప్రకటిస్తుంది. దీని ప్రకారం ఈనెల 19 నుంచి 25 వరకు అనంతపురం జిల్లాలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. జులై నెలలో వర్షాలు కురుస్తాయని ముందస్తు అంచనాలున్నాయి.

ఈటీవీ భారత్ : వర్షాభావం, తీవ్రమైన గాలి కారణంగా పదునైన నేల పొడిబారిపోతోంది. ఈ గాలి తీవ్రత ఎన్నిరోజులు కొనసాగనుంది ?

డా.మల్లీశ్వరి : జూన్, జులై నెలల్లో గాలి వేగం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం పశ్చిమ దిశ నుంచి వస్తున్న గాలివల్లనే నేల తడి ఆరిపోతోంది. సోమవారం ఉదయం నుంచి నైరుతి గాలి మొదలైంది. ఈ సమస్య నెమ్మదిగా తగ్గుముఖం పట్టనుంది.

ఈటీవీ భారత్ : నైరుతి రుతుపవనాలు గతంలో వర్షించిన తీరుతో పోల్చితే ఈసారి పరిస్థితి ఎలా ఉండనుంది ?

డా.మల్లీశ్వరి : రుతుపవనాల ప్రభావం కావచ్చు, అల్పపీడనం వల్ల కావచ్చు ఇప్పటి వరకు 12 మండలాల్లో మాత్రమే ముప్ఫై నుంచి 50 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గతంలో కూడా రుతుపవనాలు ప్రవేశించిన వెంటనే వర్షాలు రాకపోవటం, ఆలస్యంగా వర్షాలు రావటం వంటి పరిస్థితులే ఉన్నాయి.

ఈటీవీ భారత్ : కొద్ది వర్షానికే విత్తనాలు వేసిన రైతులంతా, మళ్లీ వర్షం లేక ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి రైతులకు మీరిచ్చే సలహా ఏంటి ?

డా.మల్లీశ్వరి : కనీసం 50 మిల్లీ మీటర్ల వర్షం కురిస్తేనే విత్తనాలు వేయాలని చాలా కాలంగా రైతులకు చెబుతున్నప్పటికీ తమ సూచనలు ఏమాత్రం పట్టించుకోవటంలేదు. కొద్దిపాటి వర్షానికే విత్తనాలు వేయటంవల్ల చాలా సందర్భాల్లో వేసి విత్తనాలు భూమిలోనే ఉండిపోతున్నాయి. కొన్నిసార్లు మొలకశాతం కూడా తక్కువగా ఉంటుంది. పైరు ఆరోగ్యంగా ఉండని పరిస్థితి కూడా చూడాల్సి వస్తుంది.

ఈటీవీ భారత్ : రాబోయే మూడు నెలల్లో నైరుతి రుతుపవనాలతో కురిసే వర్షాల ముందస్తు అంచనాలు ఎలా ఉన్నాయి?

డా.మల్లీశ్వరి : జులై 15వ తేదీ తరువాత నుంచి మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైతులు ఆ సమయంలో విత్తనాలు వేసుకోవటం మంచిది. ఈసారి ఆగస్టు నెలలో కూడా మంచి వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. సీజన్ గురించి రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాతావరణంపై వివిధ సంస్థల అంచనాలన్నీ మంచి వర్షాలు కురుస్తాయనే చెబుతున్నాయి.

ఇదీ చదవండి : రాజకీయ పోస్టులు ఫార్వర్డ్​.. ఇద్దరు తెదేపా సానుభూతిపరులు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.