ETV Bharat / state

చూడటానికి వెళ్లి చెక్​డ్యాములో పడి ట్రిపుల్ ఐటీ విద్యార్థి మృతి - మడుగు తండాలో విద్యార్థి మృతి

ప్రమాదవశాత్తు చెక్​డ్యాములో పడి ఓ ట్రిపుల్ ఐటీ విద్యార్థి మరణించాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా తలుపుల మండలం మడుగు తండాలో జరిగింది.

iiit student died in  Check dam  at madugu thanda
చెక్​డ్యాములో పడి ట్రిపుల్ ఐటీ విద్యార్థి మృతి
author img

By

Published : Jul 1, 2020, 6:28 PM IST

అనంతపురం జిల్లా తలుపుల మండలం మడుగు తండాలో విషాదం నెలకొంది. తండా సమీపంలోని చెక్ డ్యాములో పడి ఓ ట్రిపుల్ ఐటీ విద్యార్థి మృతి చెందాడు. గ్రామానికి చెందిన లోకేశ్ నాయక్ ట్రిపుల్ ఐటీ ఇడుపులపాయలో రెండోసంవత్సరం చదువుతున్నాడు.

ఇటీవల కురిసిన వర్షానికి చెక్ డ్యామ్​లోకి భారీగా వర్షపు నీరు చేరింది. నీటిని తిలకించేందుకు డ్యామ్ వద్దకు వెళ్లిన విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలోకి జారిపడ్డాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఈతరాక లోకేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి. అర్హురాలే.. అయినా 6 నెలలుగా పింఛను అందడం లేదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.