ETV Bharat / state

భార్యే హత్య చేయించింది... వివాహేతర సంబంధమే కారణం

అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో మృతుని భార్యే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

husband murdered with his wife in kadiri ananthapuram district
భర్తను హతమార్చిన భార్య... వివాహేతర సంబంధమే కారణం
author img

By

Published : Feb 24, 2021, 8:43 PM IST

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను... కట్టుకున్న భార్యే హత్య చేయించిన కేసులో నలుగురు నిందితులను అనంతపురం జిల్లా కదిరి పోలీసులు అరెస్టు చేశారు. కదిరి పట్టణానికి చెందిన మహిళకు ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. దీన్ని గుర్తించిన ఆమె భర్త... పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. దీనిని జీర్ణించుకోలేని నిందితురాలు... తన భర్తను హత్య చేయించాలని నిర్ణయించుకుంది.

గతనెల 2న కిరాయి హంతకులతో కలిసి నిందితురాలు తన భర్త నాగభూషణంను రోకలి బండతో దారుణంగా కొట్టి హతమార్చారు. అనంతరం పట్టణంలోని హిందూపురం రోడ్డులో ఉన్న శ్మశాన వాటికలో మృతదేహాన్ని పాతిపెట్టారు. సమాచారం తెలుసుకున్న మృతుని కుటుంబీకులు... అతని భార్యపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు.. మృతుని భార్యే ఈ హత్య చేసినట్లు నిర్థరించారు. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మృతదేహానికి రీ-పోస్టుమార్టం నిర్వహించారు.

ఇదీచదవండి...

విశాఖ శారదాపీఠంపై ఎస్​ఈసీకి ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.