అనంతపురం జిల్లా కేంద్రంలో జరిగిన మహిళ హత్య కేసులో నిదింతుడైన ఆమె భర్త చిక్కనయ్యను పోలీసులు అరెస్టు చేశారు. టూటౌన్ సీఐ జాకీర్ హుస్సేన్ తెలిపిన వివరాల ప్రకారం..కనెకల్లుకు చెందిన చిక్కనయ్యకు కర్నూలు జిల్లాకు చెందిన కవితతో 2008 సంవత్సరంలో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కాగా..స్థానిక జీసెస్ నగర్లో నివాసం ఉంటున్నారు. ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న నిందితుడు భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయమై భార్యభర్తలిద్దరూ శుక్రవారం తెల్లవారుజామున గొడవపడ్డారు. విచక్షణ కోల్పోయిన చిక్కనయ్య కవితను హత్య చేశాడు.
అనంతరం అక్కడి నుంచి పారిపోయిన చిక్కనయ్య 38వ సచివాలయం వీఆర్వో నరేశ్ కుమార్ వద్ద లొంగిపోయారు. వీఆర్వో సమక్షంలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీచదవండి: లుంగీతో భార్యను హత్యచేసిన భర్త