ETV Bharat / state

'ఆ యువతిని తీసుకొని.. ఎస్పీ హైకోర్టులో హాజరు కావాలి' - హెబియస్ కార్పస్ రిట్​పై హైకోర్టు వార్తలు

తల్లిదండ్రులు నిర్బంధించిన యువతిని తీసుకొని.. అనంతపురం ఎస్పీ వ్యక్తిగతంగా హైకోర్టుకు హాజరు కావాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టులో దాఖలు అయిన హెబియస్ కార్పస్ పిటిషన్​ను పరిగణలోకి తీసుకొన్న హైకోర్టు ఈ మేరకు ఆదేశించింది.

high court
హైకోర్టు
author img

By

Published : Sep 2, 2020, 9:03 AM IST

అనంతపురం జిల్లా ఎస్పీ వ్యక్తిగతంగా గురువారం హైకోర్టుకు హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది. ఓ యువతిని తమ ముందుకు తీసుకురావాలని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తన భార్యను ఆమె తండ్రి అక్రమంగా నిర్బంధించారనీ.. తన భార్యను కోర్టులో హాజరుపరిచేలా ఆదేశాలు జారీ చేయాలని అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ప్రవీణ్​ కుమార్, హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్​ది ప్రేమ వివాహమనీ.. ప్రస్తుతం ఆ యువతి ఆమె తల్లిదండ్రుల వద్ద ఉంటోందని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పిటిషన్​లో వివరాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. ఆ యువతిని తీసుకొని ఎస్పీ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.

ఇదీ చదవండి: అనంతపురం జిల్లాలో యూరియా కుంభకోణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.