అనంతపురం జిల్లా పెనుకొండలో ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలో అక్రమంగా నిర్మించుకున్న దుకాణాలను నగర పంచాయతీ అధికారులు తొలగిస్తుండగా... సీఐటీయూ, సీపీఐ, సీపీఎం నాయకులు ఆందోళన చేశారు. దుకాణాలు తొలగించవద్దంటూ బైఠాయించి నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి, స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై స్పందించిన నగర పంచాయతీ కమిషనర్ కృష్ణ... రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా దుకాణాలను తొలగిస్తున్నామని అన్నారు.
ఇదీచదవండి.