అనంతపురం జిల్లా ధర్మవరంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేస్తామని ఆర్డీవో మధుసూదన్ స్పష్టం చేశారు. పట్టణంలోని వ్యాపారులతో సమావేశం నిర్వహించిన ఆయన.. ఇప్పటివరకు ధర్మవరంలో 116 పాజిటివ్ కేసులు నమోదు అయినందున.. ఈ నెలాఖరు వరకు పట్టణంలో పట్టు చీరల దుకాణాలు తెరవవద్దని ఆదేశించారు. ఆది, మంగళ, గురు, శనివారాలలో మాత్రమే ప్రజలు నిత్యావసర సరకులు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చారు. ఈ లాక్డౌన్ పటిష్ఠంగా అమలు అయ్యేలా...మూడు బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రజలు సహకరించాలని కోరారు.
ఇదీచదవండి.