అనంతపురం జిల్లా ఉరవకొండలో గురువారం మధ్యాహ్నం ఈదురుగాలులు, ఉరములతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు గంట పాటు కురిసిన వర్షానికి రోడ్లన్ని జలమయమయ్యాయి. పట్టణంలోని పోట్టి శ్రీరాములు కూడలి వద్ద ఓ ఇంటిపై పిడుగు పడింది. బుధవారం కురిసిన వర్షానికి ఆరటి పంట రైతులు తీవ్రంగా నష్టపోయారు.
కళ్యాణదుర్గం ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం బీభత్సం సృష్టించింది. చాపిరి గ్రామంలో వడగండ్ల వర్షం కురిసింది. గాలివాన బీభత్సానికి స్కూల్ ద్వారం పైన నేమ్ బోర్డ్ విరిగిపడింది , దొడగట్ట, చెర్లోపల్లిలో ఈదురు గాలులకు చెట్లు విరిగిపడటంతో కరెంట్ స్తంభం పడిపోయింది. తిమ్మాపురంలో రవి అనే రైతు పొలంలో పిడుగుపాటుకు ఆవు మృతి చెందింది.
ఇదీ చదవండి: