ETV Bharat / state

పెద్దవడుగూరులో భారీ వర్షం.. పొంగిపొర్లుతున్న వాగులు - heavy rains in anantapuram district latest news update

ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాలు కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. పత్తి పంట పూర్తిగా నీట మునగటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.

Heavy rain in Paddavaduguru
పెద్దవడుగూరులో పొంగిపొర్లుతున్న వాగులు
author img

By

Published : Jul 21, 2020, 11:14 PM IST

అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలో సోమవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగాయి. దిమ్మగుడి, ఆవులాంపల్లి, కొట్టాలపల్లి, వీరన్నపల్లి, చిన్నగూడూరు, లచ్చుపల్లి గ్రామాల్లో భారీ వర్షానికి చెక్ డ్యామ్ జలకళను సంతరించుకుంది. 70 ఎకరాల్లో సాగు చేసిన పత్తి పంట నీట మునిగింది. వీరన్నపల్లి గ్రామ సమీపంలోని ప్రధాన రహదారి నీటి ప్రవాహానికి కోతకు గురైంది. కాగా భారీ వర్షానికి పొంగు పొర్లుతున్న నీటి ఉద్ధృతిని ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

ఇవీ చూడండి...

వృద్ధురాలు బయటకు గెంటివేత..రోడ్డు పక్కనే పోయిన ఊపిరి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.