ETV Bharat / state

నీళ్ల కోసం పోరు.. మంత్రి అనుచరులు, పోలీసుల మధ్య వాగ్వాదం

కర్నూలులోని ఆలూరు నియోజకవర్గానికి నీరు తరలించాలని మంత్రి గుమ్మనూరు జయరాం తన అనుచరులతో కలిసి అనంతపురం జిల్లా జి.కొట్టాల వద్ద హంద్రీనీవా కాలువను తవ్వే ప్రయత్నం చేశారు. ఈ విషయంపై పోలీసులు, వారికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు మంత్రి ఉన్నతాధికారులతో మాట్లాడి.. తన అనుచరుల చేత గండి కొట్టించారు.

వాగ్వాదం
వాగ్వాదం
author img

By

Published : Mar 3, 2020, 9:32 AM IST

Updated : Mar 3, 2020, 12:23 PM IST

హంద్రీనీవా జలాల కోసం పోరు..మంత్రి అనుచరులు, పోలీసుల మధ్య వాగ్వాదం

అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం జి. కొట్టాలలో హంద్రీనీవా 444.60 కిలోమీటర్ల వద్ద కాలువకు గండి కొట్టే విషయమై ఉద్రిక్తత చోటు చేసుకుంది. కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గానికి నీరు తరలించాలని మంత్రి గుమ్మనూరు జయరాం... తన అనుచరులతో కలిసి కాలువ వద్దకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిబంధనలకు విరుద్ధమంటూ గండి ప్రయత్నాలను అడ్డుకున్నారు. అయినా మంత్రి అనుచరులు కాలువను తవ్వే ప్రయత్నం చేయటంతో... జేసీబీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి నిరసనగా వైకాపా శ్రేణులు అక్కడే బైఠాయించాయి. ఈ వ్యవహారం జరుగుతున్నప్పుడు సమీపంలోనే కారులో ఉన్న మంత్రి జయరాం అనుమతి కోసం ఫోన్‌లో ఉన్నతాధికారులతో ప్రయత్నాలు చేసి సఫలమయ్యారు. ఎట్టకేలకు తన అనుచరుల చేత గండి కొట్టించారు.

కోతకు గురైన ప్రధాన కాలువ...

ఆలూరు రైతులు గండికొట్టడం వల్లనీటి ప్రవాహం అధికమై అనంతపురం జిల్లా ఛాయాపురం వద్ద ఉన్న హంద్రీనీవా ప్రధాన కాలువ కోతకు గురైంది. గతంలో కృష్ణా జలాలు అధికంగా పారుతున్న నేపథ్యంలో ఇంజనీర్లు గండి పూడ్చివేతకు యత్నించారు. కానీ బురద ఎక్కువుగా ఉండటంతో పనులను నిలిపివేశారు. కాలువ కోతకు గురవ్వటంతో నీరు వృథాగా పోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి...నౌకాదళం.. మురుగు వ్యర్థాలతో సతమతం

Last Updated : Mar 3, 2020, 12:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.