ఇదీ చదవండి : అమరావతి మద్దతుగా.. లండన్‌లో ప్రవాసాంధ్రుల నిరసన
హంద్రీనీవా కాల్వకు గండి... భారీగా నీరు వృథా - హంద్రీనీవా కెనాల్‌కు గండి వార్తలు
అనంతపురం జిల్లా సింగిరివాండ్లపల్లి వద్ద హంద్రీనీవా పుంగనూరు కాల్వకు గండి పడింది. చెర్లోపల్లి జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తుండగా.. ప్రవాహం పెరిగి గట్టు కోతకు గురైంది. గండి పడటం వలన భారీగా నీరు వృథా అయ్యింది. గట్టు పునరుద్ధరణకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో జలాశయం గేట్లు మూసివేసి గట్టు పునరుద్ధరణకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
హంద్రీనీవా కాల్వకు గండి... భారీగా నీరు వృథా
అనంతపురం జిల్లా సింగిరివాండ్లపల్లి సమీపంలో హంద్రీనీవా పుంగనూరు కాల్వకు భారీ గండిపడింది. చెర్లోపల్లి జలాశయం నుంచి చిత్తూరు జిల్లాకు అధికారులు నీటిని విడుదల చేశారు. చెర్లోపల్లి జలాశయం నుంచి 36వ కిలోమీటరు వద్ద కాల్వ గట్టు తెగిపోయి కృష్ణా జలాలు వృథా అయ్యాయి. గతంలో కాల్వ నుంచి చెరువులకు నీటిని మళ్లించిన ప్రదేశంలో భారీ కోత పడింది. శనివారం రాత్రి గట్టు తెగిపోయిందన్న సమాచారంతో హంద్రీనీవా సుజల స్రవంతి అధికారులు.. గట్టు పునరుద్ధరించేందుకు ప్రయత్నించారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వలన అధికారుల ప్రయత్నాలు ఫలించలేదు. అధికారులు జలాశయం గేట్లు మూసివేసి నీటిని నిలిపివేశారు. పుంగనూరు కాల్వకు తరచూ గండ్లు పడుతుండటం దిగువ ప్రాంత రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగు, సాగునీటి కోసం చెర్లోపల్లి జలాశయం నుంచి దిగువ ప్రాంతాలు నీటిని విడుదల చేస్తున్నా... తరచూ కాల్వకు గండ్లు పడి నీరు వృథా అవుతుందని స్థానికులు వాపోతున్నారు.
ఇదీ చదవండి : అమరావతి మద్దతుగా.. లండన్‌లో ప్రవాసాంధ్రుల నిరసన
sample description