ఓ మనసున్న వికలాంగుడు లాక్డౌన్ నేపథ్యంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పలువురు అనాథలు, బిచ్చగాళ్లు, వృద్ధులకు భోజన సౌకర్యం కల్పిస్తున్నాడు. పట్టణంలో ఒంటరి మహిళలను ఆకలితో అలమటిస్తున్నవారిని గుర్తించి వారి ఉన్న చోటికే నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నాడు. ఉద్దీప్ సింహా అనే యువకుడు పలువురు దాతల నుంచి సేకరించిన ఆహార పదార్థాలతోపాటు, తన సొంత డబ్బులతో వీరికి ఆహారాన్ని సమకూర్చుతున్నాడు. ఆదివారం రోజున మాంసాహార భోజనం ఈ యువకుడు అందిస్తుండటం విశేషం.
ఇవీ చూడండి...