రాజధాని మార్పుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవాలని... దీనిలో కేంద్ర సర్కారు ప్రమేయం లేదని భాజాపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. అభివృద్ధినంతా ఒకే ప్రాంతానికి పరిమితం చేయకుండా...వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించాలని సూచించారు. అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన జీవీఎల్... రాయలసీమ జిల్లాల్లోనే హైకోర్టును ఏర్పాటు చేయాలని భాజపా గతంలోనే డిమాండ్ చేసిందన్నారు. కోడెల శివప్రసాదరావు మృతిపై విచారణ జరిగితే వాస్తవాలు బయటకొస్తాయన్నారు.
ఇదీ చదవండి
సివిల్ వివాదంలో ఎస్సై జోక్యం... ముగ్గురు రైతుల ఆత్మహత్యాయత్నం...