ETV Bharat / state

గుత్తి రోడ్డు విస్తరణ వివాదాస్పదం - అనంతపురం తాజా వార్తలు

అనంతపురం జిల్లాలో గుత్తిరోడ్డు విస్తరణ వివాదాస్పదంగా మారింది. గుత్తేదారు సంస్థ ఇష్టారాజ్యంగా పనులు చేపడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

gutthi road construction
వివాదాస్పదంగా మారిన గుత్తిరోడ్డు
author img

By

Published : Oct 11, 2020, 8:09 PM IST

అనంత నగరం పాతూరులోని గుత్తిరోడ్డు విస్తరణ వివాదాస్పదంగా మారింది. అలైన్‌మెంట్‌ మార్చేసి, ఇష్టారాజ్యంగా రోడ్డు నిర్మాణపనులకు సన్నాహాలు చేపడుతున్నారు. కనకదాస విగ్రహం నుంచి తడకలేరు వరకూ 5 కి.మీ.మేర 100 అడుగుల విస్తీర్ణంతో నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి టెండర్లు నిర్వహించారు. రూ.51 కోట్లతో రహదారి నిర్మిస్తున్నారు. జాతీయ రహదారుల శాఖ పనులు చేపడుతోంది. నగర శివారు నుంచి తడకలేరు వరకూ సమస్య లేదు. కనకదాస విగ్రహం నుంచి వేణుగోపాల్‌నగర్‌ మలుపు వరకు సమస్య తలెత్తుతోంది.

ఐదులైట్ల కూడలి వద్ద గతంలో ఇచ్చిన మార్కింగ్‌ కాకుండా మరో మార్కింగ్‌ ప్రకారం విస్తరణ పనులు చేపడుతున్నారు. నేడో రేపో భవనాలు కూల్చివేతకు రంగం సిద్ధమవుతున్నారు. అలైన్‌మెంట్‌ మార్చినట్లు విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు అమ్మవారి ఆలయం ఉంది. ఆలయం జోలికి పోకుండా ఇతర నిర్మాణాలను తొలగించేలా మార్కింగ్‌ ఇచ్చారు. ఆ మార్కింగ్‌ కాస్త మారిపోయింది. బాధితులు కొందరు రెండు రోజులుగా నగరపాలక అధికారులకు ఫిర్యాదు చేశారు. రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న గుత్తేదారు సంస్థ ఇష్టారాజ్యంగా పనులు చేపడుతున్నట్లు ఆరోపించారు.

రెండో మార్కింగ్‌ ఎవరిచ్చారు?

నగరపాలక, జాతీయ రహదారుల శాఖ అధికారుల సమక్షంలో రోడ్డు సర్వే చేశారు. సర్వేయరు మార్కింగ్‌ కూడా ఇచ్చారు. నగరపాలక సర్వేయరు ఇచ్చిన మార్కింగ్‌ ఇప్పుడు మారిపోయింది. సర్వే అధికారులు తాము ఒకసారి మాత్రమే మార్కింగ్‌ ఇచ్చామని చెబుతున్నారు. కానీ, రెండో మార్కింగ్‌ ఎవరు ఇచ్చారో అర్థం కావడం లేదు. రోడ్డు స్థలం చూపించడం వరకూ నగరపాలక సంస్థ పని. ఆ తరువాత జాతీయ రహదారులశాఖ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. కొత్త మార్కింగ్‌ ఎవరు ఇచ్చారో అర్థం కావడం లేదు. ఏది ఏమైనా న్యాయబద్ధంగా సర్వే ప్రకారం రహదారి విస్తరణ పనులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

పనుల అడ్డగింత

gutthi road construction
వివాదాస్పదంగా మారిన గుత్తిరోడ్డు

గుత్తిరోడ్డు విస్తరణ పనులను స్థానికులు శనివారం అడ్డుకున్నారు. ఒకవైపు మాత్రమే ఆక్రమణలు తొలగిస్తున్నారని, మరోవైపు రాజకీయ నాయకుల బంధువులకు చెందిన భవనాలు ఉన్నందున కూల్చడం లేదని స్థానికులు ఆరోపించారు. నిర్మాణాలకు కూల్చివేయకుండా హిటాచీ ముందుకు సాగకుండా అడ్డుకున్నారు. జాతీయ రహదారుల శాఖ అధికారులు, గుత్తేదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆర్‌అండ్‌బీ కొలతల ప్రకారమే రోడ్డు ఏర్పాటు చేయాలని ఆందోళన చేశారు. నిబంధనల ప్రకారమే పనులు చేస్తామని అధికారులు చెప్పడంతో ఆందోళన విరమించారు.

సర్వే ప్రకారమే పనులు

నగరపాలకసంస్థకు చెందిన స్థలం వరకే రహదారి విస్తరిస్తాం. అలైన్‌మెంట్‌ మారడానికి వీలులేదు. సర్వేయరు ఇచ్చిన నివేదిక ప్రకారమే పనులు చేయిస్తాం. స్థానికుల నిర్మాణాలకు కూడా పెద్ద నష్టం ఉండదు. - రామచంద్రారెడ్డి, డీఈ, జాతీయ రహదారులశాఖ

--

ఇదీ చదవండి:

బాలికే భవిష్యత్: చిన్నారులే కానీ... నేడు మాత్రం 'ప్రభుత్వ ఉద్యోగులు'!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.