ఈ బాలుడి వయసు పదిహేడేళ్లు. పుట్టుకతోనే అంగవైకల్యం. బాగు చేయించడానికి.... ఆర్థిక సామర్థ్యానికి మించి ప్రయత్నాలు జరిగినా ఫలితం దక్కలేదు. కుమారుడికి వైద్యం చేయించటానికి వెళ్తూ.... తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరి ముగ్గురి బాధ్యత.... బాలుడి అమ్మమ్మ సుజాతమ్మే తీసుకుంది. రోడ్డు ప్రమాదానికి గురైన కుమార్తె, అల్లుడికి వైద్యం కోసం అప్పులు చేసింది. అదీ చాలక.... ఇల్లు తాకట్టుపెట్టి లక్షల రూపాయలతో శస్త్రచికిత్సలు చేయించినా, ఇద్దరి ప్రాణాలూ దక్కలేదు. అప్పటినుంచి, పుట్టుకతోనే మానసిక దివ్యాంగుడైన కూతురి కుమారుడు పవన్.... ఈమెకు సర్వస్వం అయ్యాడు.
అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన సుజాతమ్మ, మనవడి పరిస్థితి విషమిస్తున్నందున 2016లో తలకు శస్త్రచికిత్స చేయించింది. పవన్ మానసిక స్థితి బాగుపడకపోగా కంటిచూపు కూడా కోల్పోయాడు. కూతురు, అల్లుడి వైద్యం కోసం చేసిన లక్షల అప్పు తీరకముందే..... మనవడి కోసం మరింత రుణం చేయాల్సి వచ్చింది. కుటుంబపోషణకు అండగా ఉన్న గేదెలను అమ్మి వైద్యం చేయించినా.... ఆరోగ్యం క్షీణించిందే తప్ప మెరుగు కాలేదు. ఇన్ని కష్టాలూ చాలవన్నట్లు.. ఆమెపైనా క్యాన్సర్ కక్ష గట్టి ప్రాణాలు తోడుతోంది.
పవన్‌కు వైద్యం చేయించినా లాభం లేదని వైద్యులు చెప్పిన మాటతో... క్యాన్సర్ తనను కబళిస్తే మనవడి పరిస్థితి ఏంటని సుజాతమ్మ కన్నీరు మున్నీరవుతోంది. దాతలు సాయం చేస్తే బాగుంటుందని..... స్థానికులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదీచదవండి.