విజయవాడ సత్యనారాయణపురంలోని ఆంజనేయస్వామిని బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు దర్శించుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఏకాంతంగా స్వామివారికి అభిషేకాలు జరిపారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలందరినీ కాపాడాలని ఆకాంక్షిస్తూ అనంతపురం జిల్లా హిందూపురంలో పూజలు నిర్వహించారు. సుగురు ఆంజనేయ స్వామి దేవాలయంలో పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు.
విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పూజలు చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల బైటిపేట శ్రీఆంజనేయస్వామి ఆలయంలో భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. విశాఖపట్నం జిల్లా చోడవరంలో 200 కిలోల జిలేబీలను స్వామివారికి నివేదించారు. అనంతపురం జిల్లా నేమకల్లు ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
ఇదీచదవండి.