అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో కేరళీయలు నిర్వహించిన ఓనం పర్వదిన వేడుకలు వారి సాంప్రదాయలు ప్రతిబింబేంచేలా సాగాయి. ఇందులో భాగంగా సాయికుల్వంత్ మందిరంలో సత్యసాయి మహా సమాధిని కేరళ సాంప్రదాయ పద్ధతిలో ముస్తాబు చేశారు. కేరళీయులు అమితంగా ఆరాధించే వామనమూర్తి, సత్యసాయి నామస్మరణతో ప్రశాంతి నిలయం పులకించిపోయింది. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరి భక్తులను పరవశింపజేసింది. ఓనం సందర్భంగా కేరళీయులు వేలాది మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఇదీ చూడండి: కోర్కెల పండుగకు... పెద్ద ఎత్తున పోటెత్తుతున్న భక్తులు