అనంతపురం జిల్లా రాయదుర్గం కోటలో వెలసిన శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య 2092వ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. సుప్రభాత సేవ, గంగాపూజ, ఉదయ మహన్యాస పారాయణ, ఏకాదశ రుద్రాభిషేకము, అష్టోత్తర శతనామావళి తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. వేద బ్రాహ్మణులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని పల్లకిలో ఊరేగించారు. రాయదుర్గం ఎమ్మెల్యే, విప్ కాపు రామచంద్రారెడ్డి దంపతులు పాల్గొని స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు.
ఇదీ చదవండి: