వృద్ధులకు పంపిణీ చేయాల్సిన పింఛన్ సొమ్ముతో ఓ వాలంటీర్ ఉడాయించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అనంతపురం జిల్లా తలుపుల మండలం ఓబుళరెడ్డి పల్లికి చెందిన గ్రామ వాలంటీర్ సాధిక్‌కు అధికారులు పింఛన్ పంపిణీ బాధ్యతలు అప్పగించారు. మొత్తం 77వేల రూపాయలు తీసుకెళ్లిన వాలంటీర్ రెండు రోజులైనా పంపిణీ చేయకపోవడంతో అధికారులు సచివాలయ సిబ్బందితో ఆరా తీశారు.
వాలంటీర్ సాధిక్ డబ్బుతో ఉడాయించినట్లు నిర్ధారణ కావడంతో అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పింఛను సొమ్ముతో సాధిక్ పారిపోయినట్లు తెలుసుకున్న కుటుంబ సభ్యులు డబ్బులు మొత్తం అధికారులకు అందచేశారు. పింఛను డబ్బుల విషయాన్ని ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లగా.. వాలంటీర్‌పై చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: 'రూ.50 వేల కంటే ఎక్కువ తీసుకువెళ్తే రశీదు తప్పనిసరి'