కరోనా లాక్ డౌన్ సమయంలో కరెంట్ బిల్లును ఇష్టానురాజ్యంగా పెంచారని.. జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు చిలకం మధుసూధన్ రెడ్డి పేర్కొన్నారు. ఆపద సమయంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం ప్రజలపై భారం వేసిందని అన్నారు.
అనంతపురం జిల్లా ధర్మవరంలో మాట్లాడిన ఆయన.. రాయలసీమ వ్యాప్తంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో కార్యాలయాల్లో, ఇళ్లలో నిరసన దీక్ష చేపడతామన్నారు. రాష్ట్రంలో భూముల అమ్మకాన్ని ప్రభుత్వం వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: