ETV Bharat / state

గుత్తి సబ్​జైలు​లో​ ఖైదీలకు కరోనా - అనంతపురం తాజా వార్తలు

అనంతపురం జిల్లా గుత్తి సబ్​జైలు​లోని ఖైదీలకు కరోనా సోకింది. వారం రోజుల క్రితం జైలులో కొందరు కొవిడ్ బారిన పడగా.. తాజాగా మరో నలుగురికి కరోనా సోకినట్లు జైలు సూపరింటెండెంట్ తెలిపారు.

గుత్తి సబ్ జైల్​ ఖైదీలకు కరోన
గుత్తి సబ్ జైల్​ ఖైదీలకు కరోన
author img

By

Published : Apr 20, 2021, 8:31 PM IST

అనంతపురం జిల్లా గుత్తి సబ్​జైల్లో నలుగురు ఖైదీలకు కరోనా వైరస్ నిర్ధారణ అయినట్లు జైల్​ సూపరింటెండెంట్ రమేశ్​ తెలియజేశారు. వారం రోజుల క్రితం జైలులోని ఆరుగురికి కరోనా నిర్ధారణ కాగా.. మిగతా 64 మంది ఖైదీలకు పరీక్షలు నిర్వహించగా అందులో నలుగురు రిమాండ్ ఖైదీలకు కొవిడ్ నిర్ధారణ అయినట్లు వైద్య అధికారులు తెలిపారు.

నలుగురిని జిల్లా కేంద్రంలోని జేఎన్​టీయూలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రానికి తరలించినట్లు జైలు సూపరింటెండెంట్ తెలిపారు. గుత్తి సబ్​జైల్​లో ఇప్పటివరకు పది మందికి కరోనా సోకినట్లు సూపరింటెండెంట్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

కిరికెర వద్ద ప్రభుత్వ స్థలం కబ్జా... ఆక్రమణదారులకు నోటీసులు జారీ

కేంద్రం అనుసరిస్తున్న టీకా విధానం బూటకం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.