ETV Bharat / state

జేసీ.కుటుంబం ఆధ్వర్యంలో గో గ్రీన్ కార్యక్రమం - JC FAMILY NEWS

భూమిపై మానవుడు మనుగడ సాధించాలంటే చెట్లతోనే సాధ్యమని తాడిపత్రి మున్సిపల్ చైర్మెన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. పెన్నానది ఒడ్డున ఉన్న జాయ్ పార్క్​లో 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 'గో' గ్రీన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

go_green_program_chairman_jc_opening
జేసీ.కుటుంబం ఆధ్వర్యంలో గో గ్రీన్ కార్యక్రమం
author img

By

Published : Aug 16, 2021, 3:53 PM IST

75వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని తాడిపత్రి మున్సిపల్ చైర్మెన్ జేసీ. ప్రభాకర్ రెడ్డి.. పెన్నానది ఒడ్డున ఉన్న జాయ్ పార్క్​లో 'గో' గ్రీన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భూమిపై మానవుడు మనుగడ సాధించాలంటే చెట్లతోనే సాధ్యమని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

కరోనా సమయంలో ఆక్సిజన్ లేక అనేక మంది మృత్యువాత పడ్డారని, వారిని కాపాడేందుకు లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేని పరిస్థితి నెలకొన్న విషయాన్ని జేసీ గుర్తు చేశారు. గోగ్రీన్ యాప్​ను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లామని అందులో 1500 మంది సభ్యులుగా చేరారన్నారు. ప్రతి ఇంట మొక్కలు నాటి వాటిని పెంచే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు.

తన తండ్రి జేసీ నాగిరెడ్డి స్వాతంత్య్రం కోసం పోరాటాలు చేశారని... ఏడు దశాబ్దాలుగా తాడిపత్రి ప్రజలు రాజకీయాల్లో తమ కుటుంబాన్ని ఆదరిస్తున్నారని తెలిపారు. తాడిపత్రిని అభివృద్ధి చేయడం తన బాధ్యతగా తీసుకున్న అని చెప్పారు.

ఆగష్టు 13వ తేదీన నిర్వహించిన పచ్చదనం-ఆవశ్యకత వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబర్చిన 10మంది విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కాలుష్య రహితంగా ఉండేందుకు తెదేపా కౌన్సిలర్లకు 20 'ఈ-బైకు'లను ఆయన ఆందజేశారు.

అనంతపురం ప్రజా గాయకుడు లెనిన్.. పచ్చదనం గురించి పాటల రూపంలో అవగాహన కల్పించారు. చెట్ల పెంపకంపై చిన్నారులు చేసిన నృత్యాలు పలువుర్ని ఆకర్షించాయి. కార్యక్రమంలో తెదేపా తాడిపత్రి నియోజకవర్గ ఇన్ చార్జి జేసీ. అస్మిథ్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మెనులు సరస్వతి, అబ్దుల్ రహీం, పలువురు తెదేపా కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'పెగసస్​పై వస్తున్న ఆరోపణలన్నీ తప్పు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.