కర్నూలు జిల్లా నుంచి కర్ణాటకకు తరలిస్తున్న జిలెటిన్ స్టిక్స్‌ను వాహన తనికీల్లో భాగంగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విధి నిర్వహణలో భాగంగా గుంతకల్లు పోలీసులు మధ్యాహ్న సమయంలో స్టేషన్ ఎదుట ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గుత్తి నుంచి బళ్లారి వైపు వెళ్తున్న బొలెరో వాహనంలో ఆరువేల జిలెటిన్ స్టిక్స్‌ను గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహన చోదకుడిని పోలీసులు విచారించి అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన రంగారెడ్డి అనే వ్యక్తి కర్నూలు జిల్లా పోతుదొడ్డి గ్రామం వద్ద గోదాములో పేలుడు పదార్థాలను నిల్వ ఉంచారని వాహన డ్రైవర్ తెలిపాడు. అక్కడ నుంచి బళ్లారిలోని కాటమేశ్వర బోర్‌వెల్స్‌కు తీసుకెళ్తున్నారని తమ విచారణలో తేలిందని గుంతకల్లు గ్రామీణ సీఐ రాము తెలిపారు. ఈ చర్యలకు పాల్పడిన యజమానులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు సీఐ వివరించారు.
కర్నూలు నుంచి కర్ణాటకకు తరలిస్తున్న జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం - అనంతపురంలో జిలెటిన్ స్టిక్స్ పట్టుకున్న పోలీసులు
కర్నూలు జిల్లా నుంచి కర్ణాటకకు తరలిస్తున్న జిలెటిన్ స్టిక్స్‌ను గుంతకల్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ చర్యలకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు గుంతకల్లు గ్రామీణ సీఐ రాము తెలిపారు.
కర్నూలు జిల్లా నుంచి కర్ణాటకకు తరలిస్తున్న జిలెటిన్ స్టిక్స్‌ను వాహన తనికీల్లో భాగంగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విధి నిర్వహణలో భాగంగా గుంతకల్లు పోలీసులు మధ్యాహ్న సమయంలో స్టేషన్ ఎదుట ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గుత్తి నుంచి బళ్లారి వైపు వెళ్తున్న బొలెరో వాహనంలో ఆరువేల జిలెటిన్ స్టిక్స్‌ను గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహన చోదకుడిని పోలీసులు విచారించి అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన రంగారెడ్డి అనే వ్యక్తి కర్నూలు జిల్లా పోతుదొడ్డి గ్రామం వద్ద గోదాములో పేలుడు పదార్థాలను నిల్వ ఉంచారని వాహన డ్రైవర్ తెలిపాడు. అక్కడ నుంచి బళ్లారిలోని కాటమేశ్వర బోర్‌వెల్స్‌కు తీసుకెళ్తున్నారని తమ విచారణలో తేలిందని గుంతకల్లు గ్రామీణ సీఐ రాము తెలిపారు. ఈ చర్యలకు పాల్పడిన యజమానులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు సీఐ వివరించారు.
ఇదీ చదవండి: పేకాట స్థావరాలపై దాడులు.. 3 లక్షల నగదు స్వాధీనం
TAGGED:
jilletin sticks news