అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో న్యూ కాలనీ వద్ద కర్ణాటక నుంచి వస్తున్న గ్యాస్ లారీ శనివారం రాత్రి ప్రమాదానికి గురైంది. దాదాపు 17,500 కేజీల హెచ్‌పీ గ్యాస్ లోడుతో ఉన్న లారీ.. అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ప్రథమ చికిత్సకు ఆసుపత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. వాహన రాకపోకలకు ఇబ్బంది కలుగకుండావేరే దారికి మళ్లించారు. స్థానికులును సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అధికారులు సకాలంలో స్పందించి.. విద్యుత్‌ను నిలిపివేసి ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇదీ చదవండి: