ETV Bharat / state

యాచకుడికి అంత్యక్రియలు నిర్వహించిన ఆపద్బాంధవ ట్రస్ట్ సభ్యులు

కరోనా వల్లే కాదు... ప్రస్తుత పరిస్థితుల్లో ఆకలితోనూ మరణిస్తున్నారు . కర్ఫ్యూ, వారాంతపు లాక్ డౌన్ కారణంగా రోడ్లపైకి వచ్చే జనాలు తక్కువ. దీంతో అనాథ వృద్ధులు, యాచకులు ఆకలితో అలమటించి తుది శ్వాస విడుస్తున్నారు. అలా మృతి చెందిన ఓ వ్యక్తికి ఆపద్బాంధవ ట్రస్ట్ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.

funeral
యాచకుడికి అంత్యక్రియలు నిర్వహించేదుకు ఏర్పాట్లు
author img

By

Published : May 11, 2021, 12:09 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండలో గడియార స్తంభం వద్ద యాచకుడు పడిపోయి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరిన ఎస్సై రమేశ్​ రెడ్డి.. అతను మరణించినట్లు తెలుసుకున్నాడు. వెంటనే ఆపద్బాంధవ ట్రస్ట్ సభ్యులు, పంచాయతీ సిబ్బందికి సమాచారం అందించారు. పంచాయతీ సిబ్బందితో కలిసి ట్రస్టు సభ్యులు ఆ మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా కష్టకాలంలో కూడా మానవత్వంతో ముందుకు వచ్చి యాచకుడికి అంత్యక్రియలు నిర్వహించిన ఆపద్బాంధవ ట్రస్ట్ సభ్యులను ఎస్సై రమేశ్​ రెడ్డి, స్థానికులు అభినందించారు.

ఇదీ చదవండి: 'ప్రభుత్వం కరోనా మరణాలపై తప్పుడు లెక్కలు చెబుతోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.