అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో నాలుగో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. నియోజకవర్గంలోని లేపాక్షి, చిలమత్తూరు, హిందూపురం గ్రామీణ మండలాల్లో అభ్యర్థులు.. స్థానిక ఎంపీడీఓ కార్యాలయాల్లో నామ పత్రాలను దాఖలు చేస్తున్నారు.
బాలంపల్లి పంచాయతీ ఆరో వార్డు అభ్యర్థిగా సుకన్య అనే మహిళ.. తన రెండు నెలల చిన్నారితో వచ్చి నామినేషన్ వేశారు. అభ్యర్థుల కోసం అధికారులు కార్యాలయాల వద్ద తగిన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత పెంచారు.
ఇదీ చదవండి: