నానాటికీ పెరిగిపోతున్న పెట్రో ధరలను తట్టుకోలేక బైకుకు స్వస్తిపలికిన ఓ రైతన్న.. గుర్రం బండిపై తన పనులు చేసుకోవడం మొదలుపెట్టాడు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మల్లికార్జున పల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు.. తన పొలానికి వెళ్లి రావడానికి.. 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కళ్యాణదుర్గం పట్టణం నుంచి ఎరువుల బస్తాలు తీసుకెళ్లడానికి గుర్రపుబండిని వినియోగిస్తున్నాడు. చమురు ధరలు పెరగిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు.
''నాలుగైదు రోజుల పాటు బస్తాలను వాహనంపై తీసుకెళ్లాలంటే 300 నుంచి 400 రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. మోటార్ సైకిల్ పై తీసుకెళ్లడానికి వీలులేకుండా పోయింది. ఒక బస్తా తీసుకెళ్లినా.. ఖర్చు తడిసి మోపెడు అవుతోంది. తప్పని పరిస్థితుల్లో జట్కాని తయారు చేయించి గుర్రాన్ని కొన్నా. పెట్రోల్ ఖర్చులతో పోలిస్తే గుర్రపు దాణా ఖర్చులు కూడా తక్కువగా ఉన్నాయి'' - ఆంజనేయులు, రైతు
ఇదీ చదవండి:
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లోక్సభ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లా