ఏబీవీపీ రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు అనంతపురం వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని.. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌లో కలిపితే... తాను భాజపాలో చేరుతానన్నారు. ఇది తన స్వార్థం కోసం కాదని.. దేశం కోసమేనని తెలిపారు. ప్రాంతీయ పార్టీలు ఉన్నంత వరకు చంద్రబాబుతోనే కలసి ఉంటానని దివాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఇవీ చదవండి..