వైకాపా ప్రభుత్వం.. రైతు సమస్యలను పట్టించుకోవడంలేదని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ, రాయితీతో ఇస్తున్న బిందు పరికరాలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అనంతపురం జిల్లా ధర్మవరం ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆమె ధర్నా చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయ ఏవోకు వినతి పత్రం అందజేశారు. అంతకుమందు రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులతో కలిసి పట్టణంలో ర్యాలీ తీశారు.
చేనేత కార్మికులకు నేతన్న నేస్తం పేరిట ఇస్తున్న సాయం అర్హులకు అందడంలేదని.. అర్హులైన కార్మికులందరికీ ఇవ్వాలని పరిటాల సునీత డిమాండ్ చేశారు. రెండేళ్లలో ప్రజలకు వైకాపా ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. రైతులు, చేనేత కార్మికులకు న్యాయం చేయకుంటే భవిష్యత్త్తో ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి.. ఆ క్షణం మృత్యువుదే!!