అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం పెనకచర్ల డ్యాంలో చేపలు వదిలే కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఎమ్మెల్సీ శమంతకమణి, జాయింట్ కలెక్టర్ హాజరయ్యారు. అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవం పురస్కరించుకొని.. రూ.1510 కోట్లతో 4 ఫిషింగ్ హార్బర్లు, 25 ఆక్వా హబ్స్ ను ప్రభుత్వం ప్రారంభించిందని ఎమ్మెల్యే తెలిపారు.
పెనకచర్ల డ్యాం (మిడ్ పెన్నార్ డ్యాం)లో పది సంవత్సరాల నుంచి ఆశించినంత స్థాయిలో నీరు లేదని... ఇప్పుడు ప్రకృతి అనుకూలించడంతో డ్యాంలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయని చెప్పారు. మత్స్యకార కుటుంబాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: