అనంతపురం జిల్లా కదిరి పట్టణం మదనపల్లి రోడ్డులోని టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఈ ఘటన జరుగ్గా... భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు వ్యాపారులకు సమాచారం ఇచ్చారు. యజమానులు అక్కడికి చేరుకొని అగ్నిమాపక శాఖ అధికారుల సహకారంతో మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అప్పటికే నిల్వ ఉంచిన సామగ్రి అగ్నికి ఆహుతయ్యింది. ఈ ఘటనలో లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు.
ఇదీచూడండి.అనంతపురంలో ఆవుకు జన్మదిక వేడుకలు..!