త్రిశూల్ కంపెనీ సిబ్బంది నివాసం కోసం ఏర్పాటు చేసిన కంటైనర్లో మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో ఎవరూ అందులో లేని కారణంగా.. పెను ప్రమాదం తప్పిందని పెనుగొండ అగ్నిమాపక కేంద్ర అధికారి విజయ్ కుమార్ తెలిపారు. సోమవారం ఉదయం కంటైనర్లో ఉన్న సిబ్బంది డ్యూటీ కి వెళ్ళిన తర్వాత ఘటన జరిగింది.
విషయం తెలుసుకున్న కియా పరిశ్రమ అగ్నిమాపక వాహనం, పెనుగొండ అగ్నిమాపక కేంద్రం వాహనం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. సిబ్బంది వస్త్రాలు, విద్యార్హత పత్రాలు, ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది.
ఇదీ చదవండి: