అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం వెంకటంపల్లి పెద్ద తండాలో అగ్నిప్రమాదం జరిగింది. రాందాస్ నాయక్ అనే రైతుకు చెందిన 8 ట్రాక్టర్ల వేరుశనగ పొట్టు దగ్ధమైంది. ఒకరు నిర్లక్ష్యంగా పొగ తాగి ఆ పొట్టుపై వేయడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు రూ.1,60,000 నష్టం వాటిల్లిందని రైతు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. లేకుంటే మరికొన్ని వాటికి అంటుకొని భారీగా నష్టం వచ్చేదాని రైతు అన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: బైక్ను ఢీకొన్న బస్సు.. ఒకరు మృతి మరొకరికి తీవ్రగాయాలు