విద్యుదాఘాతంతో ఎలక్ట్రిక్ దుకాణంలో మంటలు చెలరేగిన ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ దుకాణంలో జరిగింది. ఈ ప్రమాదంలో దుకాణంలోని కొంత సామాగ్రి దగ్ధం అయింది. సమయానికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
తాడిపత్రి పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా మూసి ఉన్న శ్రీనివాస అండ్ కో ఎలక్ట్రికల్ దుకాణం నుంచి పొగలు రావడంతో గమనించిన స్థానికులు.. దుకాణం యజమానితో పాటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటేనే మంటలను అదుపు చేయడంతో పక్క దుకాణాలకు మంటలు వ్యాపించలేదు. విద్యుదాఘాతం కారణంగానే అగ్నిప్రమాదం సంభవించినట్లుగా అగ్నిమాపక శాఖ అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: