జగన్ పాలనలో చేతి వృత్తులు, కులవృత్తులను ఆధారంగా చేసుకొని జీవిస్తున్న వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని రాష్ట్ర తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని 29,30వ వార్డుల్లో జగనన్న నేస్తం పథకం ద్వారా లబ్ధి పొందని వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ కోతల కారణంగా పని సాగక ఆర్థికంగా నష్టపోతన్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలు.. సంపన్నులకు, పలుకుబడి కలవారికి తప్ప అర్హులైన పేదలకు అందడం లేదని వాపోయారు.
'రాయదుర్గం నియోజకవర్గంలో ఎక్కువమంది ప్రజలు వస్త్ర పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. దాదాపు 10 వేల కుటుంబాలకు పని లేక, ఉత్పత్తులను కొనే నాథుడు లేక నరకయాతన అనుభవిస్తున్నారు. కావునా.. ప్రభుత్వం తక్షణమే కార్మికులను ఆదుకోవాలి'
-మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు
ఇదీచదవండి.