Father murdered son : అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని మదీన కాలనీ(ఎల్లమ్మ) తగ్గులో 93సంవత్సరాల వయస్సున్న షేక్ జాఫర్ కూలి పనులు చేస్తూ నివసిస్తున్నాడు.ఆయనకు ఆరుగురు సంతానం. 55ఏళ్ల ఖలీల్ నాలుగో సంతానం. మద్యానికి బానిసైన ఖలీల్ ను అతని భార్య వదిలేసి ఇద్దరు పిల్లలతో సహా ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తండ్రీకుమారులే ఇంట్లో నివసిస్తున్నారు. ఖలీల్ రోజూ మద్యాన్ని ఫూటుగా తాగి వచ్చి డబ్బులు కోసం తండ్రిని వేధించేవాడు. తన వికృత చేష్టలతో విసిగించేవాడు. తనకు మద్యం సేవించేందుకు డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తాయని భయపెట్టేవాడు. కుమారుడి వేధింపులు భరించలేని తండ్రి.. తనని ఎక్కడ చంపేస్తాడోనని భయపడి మద్యం మత్తులో నిద్రపోతున్న ఖలీల్ తలపై ఇనుపరాడ్ తో బలంగా బాదాడు. దీంతో అతని తల ఛిద్రమైంది. ఖలీల్ అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడిని చంపిన తండ్రి నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి ఖలీల్ ను తానే హత్య చేసినట్లు ఒప్పుకొని లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న రెండవ పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి : వైఎస్ విజయమ్మ కేసీఆర్ చిరంజీవిలను మర్యాద పూర్వకంగా కలిసిన మంత్రి రోజా